Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమె ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేస్తుందని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

MLC Kavitha

MLC Kavitha Bail : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు..

కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమె ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేస్తుందని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆయన అభ్యర్థించారు ఇరు వర్గాల వాదనలువిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపధ్యంలో ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, హరీశ్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వచ్చారు.