Krishna River : కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట..సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు

కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Krishna River : కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట..సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు

T Govt Orders New Dam On Krishna River

Updated On : June 24, 2021 / 10:22 PM IST

Krishna River : కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం అనుమతులు ఇచ్చింది. 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం కానుంది.

రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా కుసుమర్తి వరద కాల్వ నిర్మాణం జరుగనుంది. ఆలంపూర్, గద్వాల ప్రాంతాల్లోని 2 లక్షల ఎకరాలకు నీటి కోసం సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం పులిచింతల వద్ద ఎత్తిపోతల నిర్మాణం, లక్షల ఎకరాల మేర అంతరం ఉన్న ఆయకట్టుకు నీరందించేలా సాగర్ టెయిల్ పాండ్ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగేందుకు నిర్ణయం తీసుకుంది. వీటన్ని ప్రాజెక్టులకు సర్వే చేయాలని నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.