Tarun Chugh : బీఆర్ఎస్ కోసమే రేవంత్ రెడ్డి పాదయాత్ర, నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇవ్వాలి-తరుణ్ చుగ్
Tarun Chugh : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయి. కేసీఆర్ సహా.. దేశంలో 2 డజన్ల మంది ప్రధాని పదవిని కోరుకుంటున్నారు.

Tarun Chugh (Photo : Twitter)
Tarun Chugh : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ కోసమే కాంగ్రెస్ పని చేస్తోందని, బీఆర్ఎస్ కోసమే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయన్నారు తరుణ్ చుగ్. ఢిల్లీలో ఖర్గే, బీఆర్ఎస్ దోస్తీపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ సహా.. దేశంలో రెండు డజన్ల మంది ప్రధాని పదవిని కోరుకుంటున్నారని తరుణ్ చుగ్ అన్నారు. మల్లికార్జున ఖర్గే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి కోరుకుంటున్నారని చెప్పారు.
” తెలంగాణలో కేసీఆర్ అత్యాచార ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాటం సాగిస్తాం. నిరుద్యోగులకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేయాలి. బండి సంజయ్ నాయకత్వంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళలు కొనసాగిస్తాం” అని తరుణ్ చుగ్ అన్నారు.