Minister KTR : మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. వీడియో వైరల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ గా వెళ్తున్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద మంత్రి కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు.

Minister KTR Convoy
Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర వాటిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతోపాటు, సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది బుధవారం తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ గా వెళ్తున్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద మంత్రి కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి వాహనాన్ని, కాన్వాయ్ లోని ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి, సిబ్బంది పూర్తిగా సహకరించారు. తనిఖీ పూర్తయిన అనంతరం మంత్రి కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది
పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.
మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో మంత్రి కేటీఆర్… pic.twitter.com/hb6PemRcU5
— KTR News (@KTR_News) November 1, 2023