Bandi Sanjay : ఈ నెల 28 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఈ నెల 28 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bandi Sanjay : ఈ నెల 28 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర

Bandi Sanjay Padayatra

Updated On : August 23, 2021 / 7:44 AM IST

Bandi Sanjay Padayatra : ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఈ నెల 28 నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన తర్వాత బండి‌ సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

యూపీ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మరణంతో బీజేపీ జాతీయ నాయకత్వం రేపటి వరకు సంతాప దినాలను ప్రకటించింది. దీంతో రేపు ప్రారంభం కావాల్సిన బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఇక ఈ నెల 28న భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

వాస్తవానికి బండి సంజయ్ ఆగస్టు 9న పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర కారణంగా వాయిదా వేశారు. మళ్లీ 28 నుంచి పాదయాత్ర చేపట్టాలని ఫిక్స్ అవ్వగా.. రూట్ మ్యాప్ కూడా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజా సంగ్రామయాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర విజయవంతం కోసం పార్టీకి చెందిన పలు కమిటీలు పని చేస్తున్నాయి. వివిధ కారణాలతో బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడడంతో బీజేపీ క్యాడర్‌ నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.