Bandi Sanjay : సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన బండి సంజయ్
సచివాలయంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు పదోన్నతులు కల్పించకపోవటం శోచనీయం అని ఆయన అన్నారు.

Tbjp Chief Bandi Sanjay Wrote A Letter To Kcr
Bandi Sanjay : సచివాలయంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు పదోన్నతులు కల్పించకపోవటం శోచనీయం అని ఆయన అన్నారు.
2018 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని బండి ఆ లేఖలో పేర్కోన్నారు. ఈ ఏడాది ప్రగతి భవన్‌లో జరిగిన దళిత సాధికారత సమావేశాల్లో 15 రోజుల్లో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని రెండు సార్లు హామీ ఇచ్చారు..కానీ ఇంకా ఆ హామీ అమలు కాకపోవడం దురదృష్టకరమని సంజయ్ అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతల పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.