నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

నూతన మంత్రులకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

Updated On : June 8, 2025 / 11:49 AM IST

Telangana cabinet expansion: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే..

ఇదిలాఉంటే.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరితోపాటు శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ కు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారు.