Telangana CM KCR : కేసీఆర్ జిల్లాల పర్యటన.. రోడ్ మ్యాప్ రెడీ

బహిరంగ సభ, పార్కింగ్‌ కోసం స్థలం ఖరారైన వెంటనే గ్రౌండ్‌ను చదును చేయడంతోపాటు సభావేదిక, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతం కోసం...

Telangana CM KCR : కేసీఆర్ జిల్లాల పర్యటన.. రోడ్ మ్యాప్ రెడీ

Cm Kcr

Updated On : February 7, 2022 / 7:28 AM IST

Telangana CM KCR Districts Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌ మళ్లీ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. వరుసపెట్టి జిల్లాల్లో పర్యటించేందుకు రోడ్‌ మ్యాప్‌ రెడీ చేస్తున్నారు. ఈనెల 11 నుంచి కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు రెడీకానున్నాయి. జనగామ జిల్లాతో జిల్లాల పర్యటన మొదలుపెట్టబోతున్నారు సీఎం. జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత భవనాల సముదాయంతోపాటు… టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్‌ దగ్గర నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.

Read More : RJ Kajal :: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో.. RJ కాజల్‌కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్..

టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు. కేసీఆర్‌ టూర్‌ కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జనగామ జిల్లా టూర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ హైవేలో జనగామ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.

Read More : Hyundai Cars India: దెబ్బకు దిగొచ్చిన హ్యుండయ్, క్షమాపణలు చెబుతూ ట్వీట్

బహిరంగ సభ, పార్కింగ్‌ కోసం స్థలం ఖరారైన వెంటనే గ్రౌండ్‌ను చదును చేయడంతోపాటు సభావేదిక, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతం కోసం పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనాయకులతో ఆయన సమాలోచనలు చేశారు. ఇంచార్జీలతో్పాటు.. కమిటీలను నియమించి బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాలుగా జనసమీకరణకు టార్గెట్స్‌ ఫిక్స్‌ చేశారు. సమష్టిగా పనిచేసి సీఎం సభను సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు ఎర్రబెల్లి.