తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

Updated On : April 11, 2020 / 3:10 PM IST

యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

దేశం మొత్తం గురించి ప్రధాని నిర్ణయం ఆదివారం ప్రకటిస్తారనగా ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, ఒడిశాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కన్ఫామ్ చేసేశాయి. ఇప్పుడు తెలంగాణ లాక్‌డౌన్ గురించి రాష్ట్ర ప్రజల సందేహాలపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. శనివారం ఏప్రిల్ 11న మీటింగ్ పెట్టి స్పష్టం చేశారు. 

 

> ముందు చెప్పినట్లుగానే ఇతర దేశాలనుంచి ఉత్తరాధికి వచ్చి అక్కడి నుంచి మనకొచ్చింది. 

> ఇప్పటివరకూ కరోనా కేసులు 503నమోదయ్యాయి. 14 మంది చనిపోగా, 96 మంది కోలుకున్నారు. 

> మన దగ్గర హాస్పిటల్లో 393మంది ఉన్నారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని 1200మందిని పట్టుకొచ్చి టెస్టులు నిర్వహించాం.

> ఇప్పుడు క్వారంటైన్లో 1650మంది ఉన్నారు. 

> కేసులు నమోదవడం తగ్గింది. ఒకట్రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు

> వ్యాధి ప్రభలకుండా నిరోధించే చర్యలు.. ముమ్మరం చేశాం. ప్రజల నుంచి సహకారం అందుతుంది. రాష్ట్రంలో 243చోట్లు ఇటువంటివి జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రదేశాల్లో 120ప్రదేశాల్లో టెస్టులు చేస్తున్నాం. 

> ఇప్పటి వరకూ ఒక్కరి పరిస్థితి కూడా విషమించకుండానే చర్యలు తీసుకుంటున్నాం.

> మహారాష్ట్రలో వైరస్ ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మనకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సీరియస్ గా తీసుకుని అంతా బంద్ చేశాం.

> ఏప్రిల్ 30వరకూ లాక్ డౌన్ కొనసాగించి.. మే1 తర్వాత పరిస్థితిని బట్టి తర్వాత చర్యలు తీసుకుంటాం.అదృష్టం బాగుంటే మే1నుంచి దశలవారీగా ఆలోచిస్తాం.

> పిల్లల చదువు గురించి భయపడాల్సిన అవసర్లేదు.

> క్యాబినెట్ మీట్ లో పంటల గురించి చర్చించాం. రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కింద వ్యవసాయ శాఖకు ఏప్రిల్ 15నుంచి నీళ్లు ఇస్తాం.

> ప్రధాని ఇవాళ మీటింగ్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగించాలనే అప్పీల్ చేశాయి. 

> తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం ప్రధానికి పంపుతాం. మనం కొన్ని డిమాండ్లు చేశాం. 

> రెండు లెటర్లు పంపుతున్నా. ఒకటి లాక్ డౌన్ పొడిగింపు, రెండో డిమాండ్లు.

> రబీ పంట కొనసాగుతుంది. ఈ సందర్భంలో పంట కోతల సమయంలో నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయమని కోరాం

> రైతుల వడ్డీని మాఫీ చేయాలని కోరాం.

> ప్రపంచానికి ఈ మహమ్మారి అనుభవం కొత్త. 

> 1918 స్పానిష్ ఫ్లూ, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. అప్పుడు ప్రత్యేక పద్దతులు అవలంభించారు. 

> రాష్ట్రాల రెవెన్యూ, దేశం రెవెన్యూ పరిస్థితి బాగాలేదు. కేంద్రం అభివృద్ధి చేసే ఇవ్వాలి. గతంలో సంక్షోభ పరిస్థితుల్లో అవలంభించిన పాలసీలు వాడాలి. 

> వాటిల్లో ఒకటి QE. ఇది ప్రత్యేకమైన పద్ధతి. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రోసెస్. 

> అమెరికా, బ్రిటన్ గవర్నమెంట్ లాంటి అనేక దేశాలు ఇదే పద్ధతి అవలంభిస్తున్నాయి. మన దేశం కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్‌నే అనుసరించాలి. 

> 2020కి 203లక్షల కోట్లు మన దేశ జీడీపీ.. అందులో 5శాతం ఇచ్చినా పది లక్షల కోట్లు వస్తుంది. 

> రాష్ట్రానికి రూ.4వేల కోట్ల ఆధాయం రావాలి. కేవలం 100కోట్లు మాత్రమే వచ్చింది. చిన్నపాటి ఉపాధి ఉన్నవారు, రేషన్ కార్డులు లేని వారందరికీ గ్యారంటీ ఇస్తున్నాం. 

> సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రత్యేకమైన సదుపాయం ఇవ్వాల్సిందిగా కోరాం.

> పప్పు శనగ పంట కోటా ఇవ్వాలని కోరుతున్నాం. వాటిని కొనాలని నిర్ణయించాం.

> తెలంగాణ మొట్ట మొదటి సారి 40లక్షల ఎకరాల్లో పంట పండిస్తున్నాం. 

> రైళ్లు నడవవు, విమానాలు నడవవు. అధికారిక సమాచారం వస్తుంది.

> అమెరికా లాంటి దేశం కంటే భారత్ దేశం మెరుగైన స్థితిలోనే ఉంది. 

> ఏప్రిల్ 30వరకూ దేశం నుంచి కరోనాను పారద్రోలాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. ప్రజలు కూడా సహకరించాలి. ఎటువంటి మతపరమైన సమూహాలను అనుమతించం. వ్యవసాయానికి మాత్రమే అనుమతిస్తాం. 

> ధాన్యానికి సంబంధించిన ఆహార సంస్థలకు అనుమతి ఉంది. నూనె పరిశ్రమలు ఇందులోకే వస్తాయి కాబట్టి వాటికి అనుమతి ఉంది. ఆహార సంబంధిత ఉత్పత్తులు అన్నింటికీ పర్మిషన్లు ఉన్నాయి. 

> ఆహారంలో స్వాలంభన సాధించిన దేశం మనది. మోడీకి సీరియస్ గా చెప్పా. వ్యవసాయాన్ని తప్పకుండా ప్రోత్సహించాలి. 

> వ్యవసాయం చేసేవారు కూడా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటించాలి.

> రాష్ట్రానికి సంబంధించిన అప్పులను కూడా 6నెలలు వాయిదా వేయాలని కోరాం.

> కేంద్రం నిధులను విడుదల చేసినా.. అప్పులు కట్టుకుంటూ పోతే తినడానికి ఉండదు. కేంద్రం నుంచి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయనే అనుకుంటున్నాం.

> ప్రధాని కూడా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకో పదిహేను రోజులు ఇలాగే ఉంటే దేశాన్ని కాపాడుకోగలం.

> ప్రజలకు కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నా.