హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌ రెడ్డి.. వచ్చేనెల 12న తీర్పు

కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌ రెడ్డి.. వచ్చేనెల 12న తీర్పు

CM Revanth Reddy

Updated On : May 22, 2025 / 2:41 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రేవంత్‌ రెడ్డిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన సీఎం హోదాలో కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి.

అప్పట్లో ఆయనపై బేగంబజార్‌తో పాటు నల్గొండ, మెదక్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై చేసిన కామెంట్లకు సంబంధించి కేసును ఎదుర్కొంటున్నారు.

Also Read: నంబాల కేశవరావు: చంద్రబాబుపై అలిపిరిలో దాడికి ప్రధాన సూత్రధారి.. ఇంకా ఎన్ని దాడులు చేయించారంటే?

ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన 3 కేసుల్లో వ్యక్తిగతంగా ఆయన హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ వద్దకు ఇతరులకు అనుమతి ఇవ్వలేదు.

కాగా, తనపై నమోదైనవన్నీ తప్పుడు కేసులని కోర్టుకు రేవంత్‌ రెడ్డి చెప్పారు. తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకుంది. నాంపల్లి కోర్టు వచ్చేనెల 12న తీర్పు ఇవ్వనుంది. విచారణ ముగిశాక రేవంత్ రెడ్డి కోర్టు నుంచి తిరిగి వెళ్లారు.