‘మార్చురీ’ కామెంట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. కేసీఆర్‌ను కాదంటూ.. ఉగ్రరూపం
"నా మాటలు తప్పని రుజువుచేస్తే.. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు క్షమాపణలు చెప్పేందుకు నేను రెడీ" అని అన్నారు.

CM Revanth Reddy
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూ ‘మార్చురీ’ పదాన్ని వాడిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వివాదం రాజుకోవడంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మార్చురీ అనే పదం బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించిన అన్నానని, కేసీఆర్‌ను ఉద్దేశించి కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. “మీరు స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారు.. మీకు స్టేట్ ఫ్యూచర్ అవసరం లేదు. కేసీఆర్ కుర్చీని నాలుగుకోట్ల మంది గుంజుకుని నాకు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఏముంది?
కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండాలి.. నేను ఇక్కడే ఉండాలి. రోజాగారి రొయ్యల పులుసు తిన్నది కేసీఆఆర్ కాదా? రాయలసీమను రత్నాల సీమ చేసింది కేసీఆర్ కాదా? రొయ్యల పులుసు తిని.. మాకు ఎండబెడతావా?
ఇదా మీ నీతి, జాతి? కమీషన్లకు అమ్ముడుపోకుండా జూరాల నుంచి కృష్ణా నీళ్లు తీసుకుంటే… ఇప్పుడు ఏపీ మనముందు మోకరిల్లేది. తండ్రి, కొడుకు, అల్లుడు పైశాచికానందం పొందుతున్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. అసెంబ్లీలో చర్చకు సిద్ధం. కేసీఆఆర్ చర్చలో పాల్గొనాలి. కేసీఆర్‌తో మీరు మాట్లాడి సభకు వచ్చేలా చూడండి. నా మాటలు తప్పని రుజువుచేస్తే.. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు క్షమాపణలు చెప్పేందుకు నేను రెడీ” అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఉగ్రరూపం వీడియో..