Revanth Reddy : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన.. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్‌తో సీఎం రేవంత్ భేటీ..!
Revanth Reddy : కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డాక్టర్ రామ్ చరణ్ పేరొందారు.

Telangana CM Revanth Reddy
Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంలో అనేక కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
Read Also : Alla Nani: ఆళ్ల.. ఎందుకలా? వైసీపీలో భవిష్యత్‌పై ఆయనలో ఆందోళన
కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డాక్టర్ రామ్ చరణ్ పేరొందారు. గతంలో అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో డాక్టర్ రామ్ చరణ్ కలిసి పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై డాక్టర్ రామ్ చరణ్ ఆసక్తి కనబర్చారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా(BoA), టయోటా (Toyota), నోవార్టిస్ (Novartis), జనరల్ ఎలక్ట్రిక్ (GE), UST గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్ (Uniqlo), KLM ఎయిర్‌లైన్స్, మ్యాట్రిక్స్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు కన్సల్టెంట్‌గా డాక్టర్ రామ్ చరణ్ పనిచేశారు. వ్యాపార రంగానికి అవసరమైన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలను విశ్లేషించడంలో రామ్ చరణ్ దిట్ట కూడా.
డజన్లకొద్దీ గ్లోబల్ లీడర్లకు శిక్షణ ఇచ్చి, పలు కంపెనీలకు వ్యాపార సలహాదారుగా రామ్ చరణ్ కొనసాగుతున్నారు. రామ్ చరణ్ అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందన్న సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను సందర్శించాలని రామ్ చరణ్‌ను సీఎం ఆహ్వానించారు. అవసరమైన సూచనలు చేయాల్సిందిగా రామ్ చరణ్‌ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు.