Corona Cases : తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Corona Cases : తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు

Corona

Updated On : November 26, 2021 / 9:01 PM IST

Corona Cases :  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 171 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు.

చదవండి : Corona Cases : దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,319కి చేరింది. కరోనాతో 3,987మంది మృతి చెందారు. కరోనా నుంచి 167 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,534 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇక గ్రేటర్ పరిధిలో 75 కేసులు నమోదయ్యాయి.

చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు