Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ఆయుష్‌లో ట్రీట్‌మెంట్
కరోనా నుంచి కోలుకున్నవారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ఆయుష్ ట్రీట్ మెంట్ అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Cs Holds Meeting To Tackle Black Fungus
Black Fungus Ayush Treatment : కరోనా నుంచి కోలుకున్నవారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ఆయుష్ ట్రీట్ మెంట్ అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు అల్లోపతితో పాటు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య విధానాలను వినియోగించాలని నిర్ణయించింది. కరోనాతో బ్లాక్‌ఫంగస్ సోకిన వారికి గాంధీ ఆసుపత్రిలో నుంచి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స సదుపాయాలు కల్పించారు.
దాంతో బ్లాక్ ఫంగస్ బాధితులంతా పెద్దఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆయుష్ విభాగాల వైద్యనిపుణులతో సమావేశం నిర్వహించారు. బ్లాక్‌ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ఆయుష్ మందుల వినియోగంపై చర్చించారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రి, రామాంతపూర్‌లోని హోమియోపతి ఆస్పత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆస్పత్రుల్లో ఔషధాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఆయుష్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న చికిత్సపై కరపత్రాలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బ్లాక్‌ఫంగస్‌కు ఆయుష్‌లోనూ చికిత్స అందిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.