దుబ్బాకలో దూసుకుపోతున్న బీజేపీ : ఐదో రౌండ్ లోను ఆధిక్యమే..కనిపించని కాంగ్రెస్

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 11:32 AM IST
దుబ్బాకలో దూసుకుపోతున్న బీజేపీ : ఐదో రౌండ్ లోను ఆధిక్యమే..కనిపించని కాంగ్రెస్

Updated On : November 10, 2020 / 11:52 AM IST

Telangana Dubaka by-election counting : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఆరో రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాని అధికార టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ఐదో రౌండ్ తర్వాత కూడా నిరాశే ఎదురైంది.


కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నారు. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ ఆధిక్యత 3వేలు దాటిపోయింది. తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై రఘునందన్ రావు 3,020 ఓట్ల ఆధిక్యతను సాధించారు.


బీజేపీకి ఇప్పటి వరకు 16,517 ఓట్లు రాగా… టీఆర్ఎస్ కు 13,497 ఓట్లు పడ్డాయి. 2,724 ఓట్లను మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ దారుణమైన స్థితిలో ఉంది. అయితే, రానున్న రౌండ్లలో ఫలితాలలో ఏదైనా మార్పు వస్తుందా? లేక ఇదే సరళి కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.



https://10tv.in/telangana-dubaka-by-election-counting-bjp-leading-ram-madhav-intresting-tweet/
కాగా కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం దరిదాపుల్లోకి రాలేకపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఐదోరౌండ్ లో కేవలం 2వేల 724 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. ఇంకా 1 లక్షా 28వేల 196 ఓట్లు లెక్కించాల్సి ఉంది. బీజేపీ హవా ఇలాగే కొనసాగితే దుబ్బాకలో కమలం వికసించనుంది.