Telangana Assembly Election 2023 : తెలంగాణ చివరి అంకంలో అగ్రనేతల ప్రచార హోరు

తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది....

Telangana Assembly Election 2023 : తెలంగాణ చివరి అంకంలో అగ్రనేతల ప్రచార హోరు

Election campaign of top leaders

Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించనున్నారు. అధికార బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లిలో పర్యటించి దాసరి మనోహర్ రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేస్తారు.

ALSO READ : Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు రోడ్ షోలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కరీంనగర్ పట్టణంలో బీజేపీ బహిరంగసభలో పాల్గొంటారు. మహబూబాబాద్ పట్టణంలోనూ మోదీ బహిరంగసభలో ప్రసగిస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. అనంతరం గురుద్వారాను సందర్శించిన తర్వాత మోదీ ఢిల్లీకి వెళతారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు…డ్రోన్లతో నిఘా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. అనంతరం పెద్దపల్లిలో అమిత్ షా పర్యటిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొంటారు. చివరి అంకంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పోల్ మేనేజ్ మెంటుపై సమీక్షించి వ్యూహాన్ని రూపొందించనున్నారు. బోధన్, బాన్స్ వాడ, జుక్కల్ సభల్లో జేపీ నడ్డా పాల్గొంటారు. బీజేపీ పక్షాన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, మురళీ ధరన్ లు బీజేపీ పక్షాన ప్రచారం చేయనున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భాగేల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుది ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ప్రచారం పర్వం ముగియనున్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీల అభ్యర్థులు పోలింగ్ పర్వంపై దృష్టి సారించారు.