హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. గవర్నర్ హాజరు

Telangana Formation Day: తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం..

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. గవర్నర్ హాజరు

Telangana Formation Day

Updated On : June 2, 2024 / 7:44 PM IST

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్దకు నగరవాసులు భారీగా చేరుకున్నారు. వేడుకల్లో గవర్నర్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. కార్నివాల్, ఫైర్ క్రాకర్స్ షో ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 10 నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

అనంతరం స్టేజ్ షోస్ నిర్వహించారు. జయ జయహే తెలంగాణ గేయానికి ట్రైనీ పోలీసులతో ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్యాంక్ మండ్ పై రాత్రి 10 నిమిషాల పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఫైర్ క్రాకర్స్ షో.

ట్యాంక్ బండ్ వైపునకు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ట్యాంక్ బండ్ పై 1.5 కిలోమీటరు పొడవున కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ కళా ప్రదర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!