బతుకమ్మ పండుగకు కోటి చీరల పంపిణీ

బతుకమ్మ పండుగకు కోటి చీరల పంపిణీ

Updated On : August 22, 2019 / 8:49 AM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరల పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ నాటికల్లా చీరల పంపిణీ పూర్తవుతుందని వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రూ.900కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. గత మూడేళ్లుగా చేస్తున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. 

ఎనిమిది నెలల పాటు పని కల్పించే ఉద్దేశ్యంతో పాటు నెలకు కనీసం 7నుంచి 8వేల రూపాయల వరకూ, వీలుంటే 16నుంచి 20వేల వరకూ బతుకమ్మ చీరల ద్వారా సంపాదించవచ్చని వివరించారు. వారిలో కొందరు రూ.25వేలు కూడా సంపాదించగల్గుతున్నారని పేర్కొన్నారు. 

ప్రభుత్వ సంస్థల యూనిఫామ్ లకు, బతుకమ్మ చీరలకు, కేసీఆర్ కిట్ లకు, రంజాన్, క్రిస్టమస్ పలు రకాల ఈవెంట్లకు కలిపి నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మొత్తంగా కార్మికులంతా రూ.16వందల కోట్ల విలువైన 40.5కోట్ల మీటర్ల క్లాత్ సృష్టించారు.