Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్‌కు సర్వంసిద్ధం.. నేటి షెడ్యూల్ ఇదే.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు.. డ్రోన్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..
Telangana Global Summit 2025 : విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సమయం ఆసన్నమైంది.
Telangana Global Summit 2025
Telangana Global Summit 2025 : విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సమయం ఆసన్నమైంది. భారీగా పెట్టుబడులు ఆర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ప్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెండ్రోజులు జరిగే సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ సమ్మిట్ కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిథులు హాజరవుతున్నారు.
Also Read: Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు!
ఇవాళ మధ్యాహ్నం 1.30గంటకు గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు రెండువేల మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానుండటంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2.30గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ప్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు.
ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
సమ్మిట్ లో పలువురు సీఎంలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర రంగాల నిపుణులుపాల్గోనున్నారు. వీరికోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 27 సెషన్స్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సమ్మిట్‌లో రాష్ట్రంలో పెద్దెత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోనున్నారు.
9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది. ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. 3వేల డ్రోన్లతో తెలంగాణ ఈజ్ రైజ్.. కమ్ జాయిన్ ద రైజ్ అనే మెస్సేజ్ తో లేజర్ షో నిర్వహించనున్నారు.
మీర్‌ఖాన్‌పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఈ మేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్ లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ సూచించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. కోడ్ ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. మరోవైపు.. గ్లోబల్ సమ్మిట్‌కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
