Revanth Reddy : వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం : రేవంత్ రెడ్డి
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.

Revanth Reddy (12)
Revanth Reddy Comments Govt : హైదరాబాద్ లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని పేర్కొన్నారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. తీవ్ర వర్షాలతో వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అలెర్ట్ ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని వెల్లడించారు.
గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివర్ణించారని, హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ ను నరక కూపంగా మార్చారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపారు.
పాత భవనాలు, గోడలు, పాడు బడ్డ ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలలను బయటకు పంపవద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం, పంట నష్టాలు వచ్చాయని తెలిపారు. గత 9 ఏళ్లుగా హైదరాబాద్ లో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదని విమర్శించారు.
MLC Kavitha: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఎమ్మెల్సీ కవిత ట్విటర్ ద్వారా ఏం చెప్పారంటే?
ఈ విషయాలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పిలుపు ఇచ్చారు. బుధ, గురు వారాలలో రెండు రోజులలో ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలని సూచించారు. లేకపోతే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.