ఆన్‌లైన్ క్లాసులకు సర్వం సిద్ధం, సెప్టెంబర్ 1 నుంచే డిజిటల్ టీచింగ్, క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా

తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది.
దూరదర్శన్ యాదగిరి, టీశాట్ వంటి చానళ్ల ద్వారా పాఠాలు ప్రసారం:
కొవిడ్-19 నేపథ్యంలో నేరుగా స్కూళ్లకు విద్యార్థులను అనుమతించ లేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ ఆన్‌లైన్ పాఠాలకు టైం టేబుల్‌ను తరగతులు, సబ్జెక్టులవారీగా విడుదల చేసింది. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ వంటి చానళ్ల ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ పాఠాలు ప్రసారం మొదలు పెడుతున్నారు. అందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.