Private Teachers : ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ సర్కార్‌ ఆర్థిక సాయం

రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీసి కుబురు అందించింది. ప్రైవేట్‌ టీచర్లకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Private Teachers : ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ సర్కార్‌ ఆర్థిక సాయం

Private Teachers

Updated On : April 8, 2021 / 9:05 PM IST

financial assistance to private teachers : రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీసి కుబురు అందించింది. ప్రైవేట్‌ టీచర్లకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లు, ఇతర సిబ్బందికి సాయమందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నెలకు 2 వేల రూపాయలతో పాటు, కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

దీనికోసం ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధివిధానాలు ఖరారు చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ఆదేశించారు.

అనేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా 45 వేల మంది టీచర్లకు లబ్ధి చేకూరనుంది.