Telangana: 7 మెడికల్ కాలేజీలు, 7,007 ఉద్యోగాలు.

వీటిలో ప్రొఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులతోపాటు, మరికొన్ని ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 13 కొత్త కాలేజీలతో పాటు, గాంధీ, జగిత్యాల కాలేజీలకు కూడా పోస్టులు మంజూరు చేసింది. ఈ 15 కాలేజీలకు ఒక్కో కాలేజీకి 48 పోస్టుల చొప్పున 720 పోస్టులను మంజూరు చేసింది.

Telangana: 7 మెడికల్ కాలేజీలు, 7,007 ఉద్యోగాలు.

Telangana (2)

Updated On : June 24, 2021 / 4:00 PM IST

Telangana: కొత్తగా మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే.. ఇక ఈ మేరకు కొత్తగా ఏర్పడిన కాలేజీలకు పోస్టులు మంజూరు చేశారు. ఒక్కో కాలేజీకి 1001 పోస్టుల చొప్పున 7 మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

వీటిలో ప్రొఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులతోపాటు, మరికొన్ని ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. 13 కొత్త కాలేజీలతో పాటు, గాంధీ, జగిత్యాల కాలేజీలకు కూడా పోస్టులు మంజూరు చేసింది. ఈ 15 కాలేజీలకు ఒక్కో కాలేజీకి 48 పోస్టుల చొప్పున 720 పోస్టులను మంజూరు చేసింది.

ఇక ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు కానున్న ఏడు కాలేజీలకు అనుమతి ఇవ్వడంతో తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 16కి చేరింది.