Ration Cards: కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఎప్పుడు? నేటి నుంచి ఆ జిల్లాలో..

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి..

Ration Cards: కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఎప్పుడు? నేటి నుంచి ఆ జిల్లాలో..

New Ration Cards

Updated On : March 1, 2025 / 9:18 AM IST

Ration Cards: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి నగరంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా అలాంటి ఏర్పాట్లు జిల్లా పరిధిలో చేపట్టడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడనే అంశంపై సందిగ్దత నెలకొంది.

Also Read: బీఆర్ఎస్ లీగల్ సెల్‌.. కాంగ్రెస్‌పై వార్‌ పీక్స్‌కి చేరిందా? ఏం జరుగుతోంది?

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీకి తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో కోడ్ ముగిసిన తరువాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని, మార్చి 1 నుంచి ఆ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. దీంతో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ లేకపోవటంతో మార్చి1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవటంతో లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read: Cm Revanth Reddy: దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

హెచ్ఎంసీ వార్డు సభలు నిర్వహించినప్పుడే కార్డుల జారీ జరుగుతుందని, అంతకు మించి తామేమీ చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అయితే, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు జీహెచ్ఎంసీ అధికారుల వద్ద ఉండగా.. అర్హులను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చేపడుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది సర్కిల్ కార్యాలయాలకు దరఖాస్తుదారులు వచ్చి వెళ్తున్నా.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీపై అధికారులు స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. అయితే, సోమవారం వరకు జారీ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సర్కిల్ అధికారులు పేర్కొంటున్నారు.

 

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 1,21,016, గ్రామ సభలు, వార్డు సభల్లో 33,435 దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఇందులో 33,435 దరఖాస్తులు వందశాతం ఎంట్రీ పూర్తయింది. కులగణన ద్వారా విచారణ చేపట్టిన అధికారులు 6,700 మందిని అర్హులుగా గుర్తించారు. వారికి ఇవాళ్టి నుంచి కార్డులు అందజేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.