New Year 2022 : నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

New Year covid guide lines
New Year 2022 : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై కోవిడ్ ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని… భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ. 1000 లు జరిమానా విధిస్తారు.అన్నీ జిల్లాల్లో ఈ ఆంక్షలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేసారు.
Also Read : Omicron Rajasthan : ఒమిక్రాన్ టెర్రర్, రాజస్థాన్‌లో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలేదని కొందరు న్యాయవాదులు హై కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.