LRS Scheme: మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 25శాతం రాయితీపై సందిగ్ధత.!

లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది.

LRS Scheme: మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 25శాతం రాయితీపై సందిగ్ధత.!

LRS Scheme

Updated On : April 30, 2025 / 8:49 AM IST

LRS Scheme: లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా ఫీజుపై 25శాతం రాయితీతో చెల్లింపు గడువు తొలుత మార్చి 31తో ముగియగా.. ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో ఆ గడువు పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి గడువు పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana 10th Result: మరికాసేపట్లోనే తెలంగాణలో టెన్త్ ఫలితాలు.. సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్‌లు.. ఓవరాల్ ఫలితాల్లో మాత్రం..

ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పొడిగించాలని కోరుతూ మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ పూర్తయితేనే దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. ప్రతీరోజూ వందల మంది ఫీజులు చెల్లించేందుకు వస్తున్నప్పటికీ వివిధ స్థాయిలో వెరిఫికేషన్ పెండింగ్ ఉండటంతో ఫీజు జనరేషన్ కావడం లేదు. అప్లికేషన్లలో టెక్నికల్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని దరఖాస్తుదారులు నిత్యం అధికారుల దృష్టికి తెస్తున్నారు. ఫీజు చెల్లించేందుకు రెడీగా ఉన్నప్పటికీ ఆన్ లైన్ లో అప్డేట్ కావడం లేదు. దీంతో గడువు ముగిసి రాయితీ కోల్పోతామని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుపాటు ఎల్ఆర్ఎస్ గడువు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: BoB Savings Scheme : బ్యాంక్ ఆఫ్ బరోడాలో అద్భుతమైన స్కీమ్.. ఈ బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేస్తే చాలు.. రూ. 16,022 వడ్డీ పొందొచ్చు..!

అయితే, ప్రభుత్వం గడువుతోపాటు ప్రస్తుతం ఫీజు చెల్లించేందుకు ఇస్తున్న 25శాతం రాయితీని కొనసాగిస్తుందా లేదా అనే దానిపై సందిగ్దం నెలకొంది. మరోవైపు నెల రోజుల నుంచి ఫీజు చెల్లింపులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 15,37,159 అప్లికేషన్లురాగా ఇప్పటి వరకు 3,24,296 మంది రూ.1.170కోట్లు ఫీజు చెల్లించారు. బడంగ్ పేట, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, తుర్కయాంజల్ మున్సిపాలిటీ అత్యధికంగా ఫీజు చెల్లించిన వాటిలో ఉన్నాయి.