Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముందుగానే డబ్బులు..

తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారికి..

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముందుగానే డబ్బులు..

Indiramma Housing Scheme

Updated On : March 31, 2025 / 10:30 AM IST

Indiramma Indlu: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రతీ గ్రామంలో, పట్టణాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో 72,045 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Also Read: Highway: హైదరాబాద్- విజయవాడ హైవేపై వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ మూడు చోట్ల తగ్గిన టోల్ ఛార్జీలు

లబ్ధిదారులను ప్రకటించి రెండు నెలలు కావొస్తున్నా రాష్ట్రంలో ఇంత వరకు వెయ్యి ఇళ్లు కూడా పునాది దశను దాటలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొత్తం నాలుగు విడతల్లో రూ.5లక్షలను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో పునాదులు పూర్తయితే రూ. లక్ష, పిల్లర్లు వేసిన తరువాత రూ.1.25లక్షలు, స్లాబు పూర్తయిన తరువాత రూ.1.75లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మరో రూ.లక్ష అందిస్తామని చెప్పింది. ఈ విధానం ప్రకారం.. పునాదులు పూర్తయితేనే ప్రభుత్వం తొలి దశ డబ్బులు మంజూరు చేస్తుంది. అయితే, పేద లబ్ధిదారులకు ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంది.

Also Read: Bhadrachalam Temple : భద్రాద్రికి మహర్దశ.. రాములోరి ఆలయం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల, యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హత పొంది ఇల్లు మంజూరు అయినప్పటికీ.. చాలా మంది లబ్ధిదారుల వద్ద ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు డబ్బులు లేవు. నిబంధనల ప్రకారం పునాధులు పూర్తయితేనే తొలి దశలో రూ.లక్ష డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా మంది ఇప్పటికీ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా అందించే వడ్డీలేని రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశలవారీగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమచేసే డబ్బుల నుంచి ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నియోజకవర్గం (పాలేరు)లో ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల పరిధిలోని 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 33 మంది లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా రూ.లక్ష చొప్పున వడ్డీలేని రుణాలను మొత్తం రూ.33లక్షలు అధికారులు అందజేశారు. దీంతో వారు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి లబ్ధిదారులందరితో ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.