తెలంగాణలో కొత్త రేషన్ కార్డు మీకు రాలేదా?.. అప్లికేషన్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఇలా చేయండి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డులను..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు మీకు రాలేదా?.. అప్లికేషన్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఇలా చేయండి..

Ration Cards

Updated On : July 14, 2025 / 2:31 PM IST

Ration Card: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ షురూ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సోమవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.

Also Read: మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి.. సంవృద్ధిగా వర్షాలు.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి సంఖ్య 95లక్షలకు చేరిందని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘రాష్ట్రంలో కొత్తగా 5.61 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని, పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.’’

కొత్త కార్డు వచ్చిందో, రాలేదో​ ఎలా చెక్​ చేయాలంటే?..
♦ మీ ఫోన్​లో తెలంగాణ ఫుడ్​ సెక్యూరిటీ కార్డ్స్​ అధికారిక వెబ్​సైట్​ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ఓపెన్​ చేయాలి.
♦ హోమ్ పేజీలో ఎడమ వైపు కనిపించే “FSC Search” ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
♦ స్క్రీన్​ మీద ‘Ration Card Search’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘FSC Application Search’ బటన్​పై క్లిక్ చేయాలి.
♦ మీ-సేవ అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా సెలెక్ట్ చేసి, ‘Mee Seva No’ బాక్స్​పై టిక్​ చేయాలి.
♦ ఆ బాక్సులో అప్లికేషన్​ సమయంలో మీ సేవ అధికారులు ఇచ్చిన రసీదులోని అప్లికేషన్​ నెంబర్​ను ఎంటర్​ చేసి ‘Search’ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
♦ మీ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్​ వివరాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి. ‘Apporved’ అని ఉంటే మీకు రేషన్​ కార్డు వచ్చినట్లే. ఒకవేళ ‘Pending’ అని ఉంటే మరికొంచెం సమయం పడుతుంది.
♦ మీరు మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ ఆధార్ నంబర్ చెప్పి కూడా రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.

మీ దరఖాస్తు రిజక్ట్ అయిందా.. ఇలా చేయండి
మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అర్హత ఉండీ కొత్త రేషన్ కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దరఖాస్తు రిజక్ట్ అయితే.. రేషన్ దుకాణం వద్దకు లేదా మీ సేవ కేంద్రం వద్దకు, మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మీ దరఖాస్తు ఎందుకు రిజక్ట్ అయిందో వివరాలు తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే.. మళ్లీ సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కమిషనర్ చౌహాన్ కూడా ఇదే విషయం చెప్పారు.
కమిషనర్ చౌహాన్ ఏమన్నారంటే..?
‘రేషన్ కార్డుల లబ్ధిదారులు కార్డు తీసుకున్న క్షణం నుంచే సన్నబియ్య తీసుకోవచ్చని పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.’