తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల‌ బదిలీలు.. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల‌ బదిలీలు.. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

IAS Officers Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, సూర్యాపేట జిల్లాలతో సహా 20 జిల్లాల్లో కలెక్టర్లు స్థానచలనం పొందారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలు జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఆ తరువాత, లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Also Read : జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..

బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు ఇవే..

ఖమ్మం : ముజామిల్ ఖాన్

నాగర్ కర్నూల్ : సంతోష్

భూపాలపల్లి : రాహుల్ శర్మ

కరీంనగర్ : అనురాగ్ జయంతి

పెద్దపల్లి : కోయ శ్రీహర్ష

జగిత్యాల : సత్యప్రసాద్

మంచిర్యాల : కుమార్ దీపక్

మహబూబ్ నగర్ : విజయేంద్ర

హనుమకొండ : ప్రావీణ్య

నారాయణపేట్ : సిక్తా పట్నాయక్

సిరిసిల్ల : సందీప్ కుమార్ ఝా

భద్రాద్రి కొత్తగూడెం : జితేష్ వి.పాటిల్

వికారాబాద్ : ప్రతీక్ జైన్

కామారెడ్డి : అశిష్ సంగ్వాన్

నల్గొండ : నారాయణరెడ్డి

వనపర్తి : ఆదర్శ్ సురభి

సూర్యాపేట : తేజస్ నందలాల్ పవార్

వరంగల్ : సత్య శారదాదేవి

ములుగు : దివాకరా

నిర్మల్ : అభిలాష అభినవ్