TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే

ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పులను విరుద్ధంగా ఉందని పేర్కొంది.

TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే

TS High Court Stay Kamma and Velama communities land

Updated On : June 28, 2023 / 3:46 PM IST

TS High Court : వెలమ, కమ్మ సంఘాలకు (Velam Kamma caste communities) భూ కేటాయింపుల విషయంపై తెలంగాణ హైకోర్టు (TS High Court)స్టే విధించింది. దీనిపై తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవటానికి వీల్లేదు అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూముల కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తు కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి (KU retired professor Vinayak Reddy) హైకోర్టు (TS High Court)లో పిటీషన్ (petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తెలంగాణ సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

2021లో ఖానామెట్ (khanamet)లో ఐదు ఎకరాలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉచితంగా కేటాయించింది. దీనికి సంబంధించి జీవోకూడా జారీ చేసింది. దీనిపై రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా కోర్టు కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుబట్టింది. ఇలా కేటాయించడం ఓ రకమైన కబ్జానే అంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు (supreme court)తీర్పులను విరుద్ధంగా ఉందని పేర్కొంది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ స్టే కొనసాగుతుందని తేల్చి చెప్పింది.