Telangana Inter : ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Ts Exams
Telangana Inter Exams : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫలితాలకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే రూపొందిస్తామని సబితా ప్రకటించారు.
కరోనా మహమ్మారి చదువులను ఆగమాగం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ పై పెను ప్రభావం చూపెడుతోంది. గత సంవత్సరం నుంచి ఈ వైరస్ కారణంగా..విద్యా సంస్థలు మూత పడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా..పరీక్షలు మాత్రం నిర్వహించలేదు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ..పై క్లాసులకు ప్రమోట్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇలాగే..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..ఇంటర్ పరీక్షలపై కొంత సందిగ్ధత నెలకొనేది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చ నడుస్తోంది. పరీక్షలు నిర్వహిస్తారా ? లేదా ? అనే దానిపై విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో..2021, జూన్ 09వ తేదీ బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల నిర్వాహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ తల్లిదండ్రులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రమోట్ చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు.
ఇంటర్ విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇప్పటికే ప్రమోట్ చేయడం జరిగిందన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల కూడా రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించిన మంత్రి సబిత…త్వరలోనే విధానాలను రూపొందించి ఫలితాలు వెల్లడి చేస్తామన్నారు. ఎవరైనా విద్యార్థులు పరీక్ష రాయాలంటే పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 4 లక్షల 74 వేల మంది విద్యార్థులు పరీక్షలు రద్దు చేస్తున్నామన్నారు.
Read More : Nandamuri Balakrishna : ట్రెండింగ్‌లో బాలయ్య బర్త్‌డే సీడీపీ..