ఖాకీలకు కోడి కేసు..చచ్చిన కోడితో పోలీస్ స్టేషన్ లో పంచాయతీ

Hen Issue In Police Stationr
Hen issue in Rajasna Sirisilla District PS : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులకు ఓ వింత కేసు తగిలింది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో బిజీ బిజీగా ఉండే పోలీసుల దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. నా కోడి చచ్చిపోయింది నాకు న్యాయం చేయండీ అంటూ వేడుకున్నాడు. అసలే పనుల ఒత్తిడితో సతమతమవుతుంటే ఈ కోడి కేసు ఏంటిరా బాబూ అనుకున్న పోలీసులు అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు.
పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆ కోడి కేసు హాట్ టాపిక్ అయ్యింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గశికంటి రాజు అనే వ్యక్తి తన కోడిని చంపేశారంటూ చచ్చిపోయిన కోడిని పట్టుకుని మంగళవారం (ఏప్రిల్ 20) పోలీస్ స్టేషన్ కొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన కోడిని ఇసుక ట్రాక్టర్ తో గుద్ధి చంపేసారని ఈ కోడిని నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నానని నాకు న్యాయం చేయండీ అంటూ వేడుకున్నాడు. ఈ ఫిర్యాదు విన్న పోలీసులు నవ్వుకున్నారు. చచ్చిపోయిన కోడిని పట్టుకుని మరీ రాజు స్టేషన్‌కు రావడం చూసి అక్కడున్న పోలీసులు నవ్వుకున్నారు.