Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు.

Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు

Harish Rao

Updated On : May 22, 2022 / 2:42 PM IST

Minister Harish Rao : పెట్రోల్ ధరల తగ్గింపుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్లు వేశారు. పెట్రోల్ పై పెంచింది బారాణా.. తగ్గించింది చారాణా అని ఎద్దేవా చేశారు. 2014లో ఉన్న రూ.3.54 తగ్గించి అప్పుడు మాట్లాడండి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు. ధరలు తగ్గించినట్లు చేస్తున్న ప్రకటనలన్నీ బోగస్ అన్నారు.

కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గే అవకాశం ఉంది.

VAT on Petrol,Diesel : పెట్రోల్,డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు

మరోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లపై ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.