Colonel Santhosh Babu : వీరుడా వందనం..కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తు భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆ వీరుడా వందనం అంటూ సెల్యూట్ చేశారు.

Minister Ktr Unveiled The Statue Of Colonel Santosh Babu In Suryapet (1)
Colonel Santosh Babu : సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తు భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నాం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆ వీరుడా వందనం అంటూ సెల్యూట్ చేశారు. నీ త్యాగం ఎప్పటికీ మర్చిపోం అంటూ ప్రతిజ్ఞ చేశారు.
భారత్- చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. సంతోష్ బాబుతో పాటు మరికొందరు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జరిగింది.
కాగా..తెలంగాణ ముద్దు బిడ్డ సంతోష్ బాబు మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్న సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా ఇచ్చి గౌరవించింది. అలాగే హైదరాబాద్ లో ఓ స్థలాన్ని కూడా కేటాయిచిన విషయం తెలిసిందే.