అక్టోబర్ 12వ తేదీ వరకే చాన్స్.. ప్రభుత్వానికి డెడ్​లైన్ పెట్టిన ప్రైవేట్ కళాశాలలు.. విద్యార్థులు, తల్లిదండ్రులతో సత్యాగ్రహాలు, దీక్షలు..

Telangana Private Colleges : తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలలు డెడ్‌లైన్ విధించాయి. అక్టోబర్ 12వ తేదీ నాటికి ప్రభుత్వం ..

అక్టోబర్ 12వ తేదీ వరకే చాన్స్.. ప్రభుత్వానికి డెడ్​లైన్ పెట్టిన ప్రైవేట్ కళాశాలలు.. విద్యార్థులు, తల్లిదండ్రులతో సత్యాగ్రహాలు, దీక్షలు..

Updated On : October 2, 2025 / 8:15 AM IST

Telangana Private Colleges : తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలలు డెడ్‌లైన్ విధించాయి. అక్టోబర్ 12వ తేదీ నాటికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. 13వ తేదీ నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సత్యాగ్రహాలు, దీక్షలు చేస్తామని తెలిపాయి.

తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలకు ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో కళాశాలల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు కళాశాలల నిర్వాహకులకు సమాచారం అందించారు. అయితే, దసరాకు రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేశామని ప్రకటించడం దగా చేయడమేనని ఉన్నత విద్యా సంస్థల సమా్య (ఫతి) దుయ్యబట్టింది.

Also Read: Pawan Kalyan : రాజకీయాల్లో బద్ద శత్రువులు.. OG సినిమాలో క్యారెక్టర్ అంటే.. ఆ కండిషన్ పెట్టిన పవన్ కళ్యాణ్..

ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సమాఖ్య చైర్మన్ నిమ్మటూరి రమేశ్ బాబు మాట్లాడుతూ.. దసరా పండుగ లోపు చెల్లిస్తామన్న బకాయిలు రూ. 600 కోట్లలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.

పెండింగ్ లో ఉన్న రూ.12వందల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ. 600 కోట్లు దసరా ముందు.. మిగిలిన మొత్తాన్ని దీపావళి పండుగ లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ, ప్రస్తుతం కేవలం రూ.200 కోట్లు మాత్రమ విడుదల చేసిందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సభ్యులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల 12వ తేదీలోపు బకాయిలు చెల్లించకుంటే 13వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని కళాశాలలను నిరవధికంగా మూసివేస్తామని వారు హెచ్చరించారు. 13వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించి తరగతులు నడవకుండా చూస్తామని చెప్పారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజుల నిరసన, సత్యాగ్రహ దీక్షలు జరుగుతాయని, ఒక్కో జిల్లాల్లో వివిధ రూపాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసిన నిరసన దీక్షలు చేపడతామని అన్నారు.