కరోనా..వీళ్లు మారరు అంతే : ఉగాది వేళ..మార్కెట్లు కిటకిట..సోషల్ డిస్టెన్ ఎక్కడ ?

మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విన్నవించుకుంటున్నా…డేంట్ కేర్ అంటున్నారు ప్రజలు.
* రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు..లాక్ డౌన్ పై జనం అంతులేని నిర్లక్ష్యం..
* ప్రమాదంలో పడుతోన్న సమాజ మనుగడ…వైరస్ వ్యాప్తిపై ఏ మాత్రం లేని అప్రమత్తత..
* ఇంత క్రమశిక్షణ లేని వారిని ఏం చేయాలి ? ఈ జనానికి ఎలా చెబితే..వింటారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది..ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు..మాస్క్ లు ధరించండి..సోషల్ డిస్టెన్ పాటించండి..అంటూ ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు స్వయంగా కేసీఆర్ దండం పెట్టి చెబుతున్నా ప్రజలు వినిపించుకొనే పరిస్థితుల్లో లేనట్లుంది.
సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా..సరే..ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. కొంతమంది మాస్క్ లు వేసుకోకుండానే..దర్జాగా తిరుగుతున్నారు.
2020, మార్చి 25వ తేదీ బుధవారం ఉగాది పర్వదినం కావడంతో గ్రేటర్ పరిధిలోని మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే రావాలని, వృద్ధులు రావొద్దు…బైక్ లపై ఒక్కరి కంటే ఎక్కువ మంది ప్రయాణించవద్దని చెబుతున్నా.బేఖాతర్ చేస్తున్నారు. కనీసం సోషల్ డిస్టెన్ పాటించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చెబుతున్న నిబంధనలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు.
See Also | కరోనా అనుమానితుల ఇళ్ల ముందు రెడ్ నోటీసులు