Telangana Latest Covid List : తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే..
తెలంగాణ రాష్ట్రంలో క్రితం రోజుతో పోలిస్తే (31) కొత్త కేసులు తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 312 కరోనా పరీక్షలు నిర్వహించగా..

Telangana Covid Report
Telangana Latest Covid List : తెలంగాణ రాష్ట్రంలో క్రితం రోజుతో పోలిస్తే (31) కొత్త కేసులు తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 312 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 17 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 19 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇంకా 213 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,739 కరోనా టెస్టులు నమోదవగా.. 7లక్షల 87వేల 469 మంది పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 14వేల 939 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
అటు దేశంలో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. దేశవ్యాప్తంగా రోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకుపైగానే నమోదవుతున్నాయి. ఇక కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ 16 వేలకు చేరువయ్యాయి. నిన్న 4,36,532 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,593 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 44 మంది కరోనాతో మృరణించారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,22,193కు చేరింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలో మరో 1,755 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు (98.75%) దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు పెరిగి 15,873 (0.04%)కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 19,05,374 మంది టీకాలు వెయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 187.67 కోట్లు దాటింది.
ఇది ఇలా ఉంటే.. మద్రాస్ ఐఐటీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా అక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండటంతో ఈ క్యాంపస్ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. శనివారం మరో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 55కి పెరిగినట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
COVID-19: ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. బిక్కుబిక్కుమంటున్న చైనా ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వారం ఆర్-వాల్యూ (రీ-ప్రొడక్షన్ నంబర్) 2.1 దాటింది.
కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్ వ్యాల్యూ ద్వారా అంచనా వేస్తారు. దీని విలువ ఒకటిగా ఉంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుంది. ఒకటి దాటిందంటే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఢిల్లీలో ఈ విలువ ఇప్పుడు 2.1కి చేరుకుంది. భారత్ వ్యాప్తంగా 1.3గా ఉంది. ఐఐటీ మద్రాస్ బృందం చేసిన ప్రాథమిక విశ్లేషణలో భాగంగా ఈ విషయం వెల్లడైంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.24.04.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/5r2C3WGTNR— IPRDepartment (@IPRTelangana) April 24, 2022