Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 2వేల 707 కేసులు నమోదవగా..

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు

Telangana Corona Cases

Updated On : January 14, 2022 / 9:25 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 2వేల 707 కేసులు నమోదవగా, ఇవాళ 2వేల 398 కేసులు వెలుగుచూశాయి.

Omicron-Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

గడిచిన 24 గంటల్లో 68వేల 525 శాంపిల్స్ పరీక్షించగా… 2వేల 398 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,233 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,052కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,05,199 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,79,471 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 21వేల 676 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, పండుగ నేపథ్యంలో పాజిటివ్ కేసులు మరింతగా పెరగొచ్చనే నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.