Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 453 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ మరణాలేవీ సంభవించ లేదు.

Telangana Corona Cases
Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41వేల 310 కరోనా పరీక్షలు నిర్వహించగా 453 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33, రంగారెడ్డి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,85,596 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,74,742 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 6వేల 746 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారంతో(512) పోలిస్తే గురువార్తం పాజిటివ్ కేసులు తగ్గాయి.
COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు
దేశవ్యాప్తంగా చూసుకుంటే గత 24 గంటల వ్యవధిలో 30వేల 757 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 541 మంది కోవిడ్ తో చనిపోయారు. గడిచిన 24గంటల్లో దేశంలో 11 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉంది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటులో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
ఇక, 2020 ప్రారంభం నుంచి 4.27 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 4.19 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 67 వేల మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.03 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 3.3 లక్షల(0.78 శాతం)కు దిగొచ్చాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో 5,10,413 మంది మరణించారు. నిన్న 34.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 174 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు రిలీజ్ చేసింది.
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో వచ్చిన థర్డ్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు కట్టడిలోనే ఉండటంతో.. ఆంక్షల విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అమల్లో ఉన్న అదనపు కొవిడ్ ఆంక్షలను సమీక్షించి, సవరించాలని సూచించింది. అవసరమైతే వాటిని పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలించమని చెప్పింది.
అలాగే కొవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనందున వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్రం కోరింది. ఈ సమయంలో టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళిని పాటించడం వంటి ఐదు సూత్రాలను అమలు చేయాలని చెప్పింది.
Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు
దేశవ్యాప్తంగా రెండురోజులుగా కొత్త కేసులు 30 వేలకు సమీపంలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదుపులోనే ఉంది. ఇప్పటివరకు కొవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగించిన మొదటి రాష్ట్రంగా అసోం నిలిచింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం అయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.17.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/ac85jquLpJ— IPRDepartment (@IPRTelangana) February 17, 2022