Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

Telangana Covid
Telangana Covid : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కొవిడ్ కొత్త కేసుల సంఖ్య 500 మార్క్ ని తాకడం ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26వేల 976 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 516 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 261 కొత్త కేసులు వచ్చాయి. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ జిల్లాలో 250కి పైన రోజువారీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43 కేసులు, మంచిర్యాల జిల్లాలో 34, సంగారెడ్డిలో 24 కేసులు, ఖమ్మంలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
రాష్ట్రంలో నేటివరకు 8,01,922 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 93వేల 027 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 784కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 516 (జులై 2)గా ఉంది.
Light exposure: రాత్రి సమయంలో శరీరంపై కాంతి పడేలా నిద్రపోతే ఆరోగ్యానికి ముప్పు
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.02.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/aJtQ3TLaDY— IPRDepartment (@IPRTelangana) July 2, 2022