TS Covid Update : తెలంగాణలో ఇవాళ కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదు

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  నమోదైన  కోవిడ్ కేసుల సంఖ్య  7,90,224  కి చేరింది.

TS Covid Update : తెలంగాణలో ఇవాళ కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదు

Telangana Covid Up Date

Updated On : March 12, 2022 / 2:34 PM IST

TS Covid Update :  తెలంగాణలో ఈ రోజు కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  నమోదైన  కోవిడ్ కేసుల సంఖ్య  7,90,224  కి చేరింది.  ఈరోజు 172 మంది కోవిడ్ నుంచి కోలుకోవటంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,84,972కి చేరింది.

ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,141 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు 35 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 13 జిల్లాల్లో జీరో కేసులు నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో 10 లోపు కేసులు నమోదయ్యాయి.
Also Read : AP Covid Update : ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు-46 కేసులు నమోదు
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,05, 824 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇంతవరకు 5,92, 36,302 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.