తెలంగాణలో బడి గంటలు మోగే వేళ

Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం తెరుస్తారు. 9వ తరగతి, ఆపై తరగతులకు చెందిన విద్యార్థులకు తరగతి గదుల్లో బోధన పునఃప్రారంభం కానున్న తరుణంలో.. కోవిడ్ నిబంధనలు పాటించేలా స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజ్‌లలో చర్యలు తీసుకున్నారు.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అంతా మాస్క్ ధరించాల్సిందేనని, శానిటైజేషన్ చేసుకోవాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. టీచర్లంతా క్రమం తప్పకుండా క్లాస్‌లు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల పాటు పరిస్థితిని గమనించాక…ఇక్కట్లు లేకపోతే..ఈ నెల 15 నుంచి 6,7,8 తరగతులను చేపట్టే అవకాశం ఉంది.
– విద్యాశాఖ ఇప్పటికే హాస్టళ్లకు థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు సరఫరా.
– తరగతి గదులను మందస్తుగా శానిటైజ్.
– విద్యార్థుల మధ్య భౌతిక దూరం.
– ఇంటి నుంచే వాటర్ బాటిల్. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో నిబంధనలు.
– గుంపులు గుంపులుగా ఒక దగ్గర చేరకుండా పూర్తి జాగ్రత్తలు.
– 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర కోర్సులకు వార్షిక విద్యా క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల.
– ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 34 రోజులు, ద్వితీయ సంవత్సరానికి 34 రోజుల పని దినాలు.
– ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం.
– రెండో శనివారం కూడా తరగతులు.
– ఒక్కో తరగతి గదిలో 20 నుంచి 40 మంది.
– ఒక బెంచీకి ఒక్కరు కూర్చునేలా ఏర్పాట్లు.
– సోమవారం నుంచి పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45వరకు నిర్వహించనున్నారు.