వార్నీ.. మరీ ఇంతగా తాగేస్తున్నామా..! మద్యం వినియోగంలో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ.. సౌత్‌లో టాప్ మనమే..

రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇస్తూ..

వార్నీ.. మరీ ఇంతగా తాగేస్తున్నామా..! మద్యం వినియోగంలో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ.. సౌత్‌లో టాప్ మనమే..

Updated On : February 15, 2025 / 4:19 PM IST

Alcohol Consumption: తెలంగాణ సంస్కృతిలో మద్యం సేవించడాన్ని ఒక భాగంగా పరిగణిస్తారు. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాల్లోనూ మద్యం సేవించడం సర్వసాధారణం. ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆర్థిక వనరులు పెరగడంతో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయట. ఈ క్రమంలో మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డులను తిరగరాస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ మద్యం విక్రయాల్లో టాప్ లో ఉందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి. తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారట. అయితే, ఇక్కడ కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. గతంకంటే ఈ సంఖ్య కాస్త తగ్గింది.

Also Read: Indiramma Indlu: మీకు ఇందిరమ్మ ఇల్లు రాలేదా..? అయితే, మొబైల్‌లోనే మీ అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఉందో ఇలా చెక్ చేసుకోండి..

రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియపటేల్ సమాధానం ఇస్తూ.. భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు తెలిపారు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 ప్రకారం.. ఏపీలో 34.9శాతం మంది, తెలంగాణలో 53.8శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. అయితే, 2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2శాతం, తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారట.

Also Read: ఏఎంబీఐఎస్ టెక్నాలజీతో క్రిమినల్స్ ఆటకట్టిస్తున్న తెలంగాణ పోలీసులు.. రష్యా తరువాత హైద‌రాబాద్‌లోనే..

2024 జూన్ నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటితోపాటు 1,200 బార్లు, క్లబ్బులు కూడా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.36వేల కోట్ల ఆధాయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగా మద్యం వినియోగం పెరుగుతోందని కేంద్రం తెలిపింది.