Indiramma Indlu: మీకు ఇందిరమ్మ ఇల్లు రాలేదా..? అయితే, మొబైల్‌లోనే మీ అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఉందో ఇలా చెక్ చేసుకోండి..
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చింది..

Indiramma indlu
Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి అర్హులైన జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో చాలామంది అర్హుల పేర్లు రాకపోవటంతో మళ్లీ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో సర్వేలు చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.
Also Read: CM Revanth Reddy: ఇలాంటి వారు పదవుల సంగతి మరచిపోండి: రేవంత్ రెడ్డి వార్నింగ్
తొలివిడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు సిద్ధమైన వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అయితే, అర్హత ఉండి ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ పేరు ఏ స్టేజ్ లో ఉంది.. అసలు మనకు ఇల్లు మంజూరి అయిదా.. లేదా అనే విషయాలు తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమును పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.
ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వెబ్ సైట్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుదారులు, లబ్ధిదారులు మీ అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది..? సర్వే రిపోర్టు ఎలా వచ్చింది..? ఇల్లు మంజూరైందా..? లేదా? మంజూరుకాకపోతే కారణాలేమిటి..? ఒకవేళ మంజూరైతే ఆ ఇల్లు ఎల్1, ఎల్2, ఎల్3 జాబితాలో ఉందా..? వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి..
♦ ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వారు https://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. అందులో “గ్రీవెన్స్ స్టేటస్” సెలెక్ట్ చేయాలి.
♦ గ్రీవెన్స్ స్టేటస్ లోని సెర్చ్ లో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
♦ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేయగానే.. మీ దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.
♦ మీకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైదా..? మంజూరు కాలేదా..? మీ దరఖాస్తు ఏ దశలో ఉంది అనే వివరాలను తెలుసుకోవచ్చు.
♦ దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.