Revanth Reddy: కేసీఆర్ ఒకే ఒక్క రోజు సర్వే చేసి ఏం చేశారో తెలుసా.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా..: రేవంత్ రెడ్డి
కులగణన సర్వపై రేవంత్ రెడ్డి ఆసక్తకర కామెంట్లు చేశారు.

CM Revanth Reddy
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఒకే ఒక్క రోజు సర్వే చేసి కాకిలెక్కలు చూపించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కాకిలెక్కలు చూపించి తమ సర్వేను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో సర్వే జరిపి, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఇవాళ రేవంత్ రెడ్డి సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. తన పదవి కోసం సర్వే చేయలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం సర్వే చేశామని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకూడదనే సర్వేను పక్కాగా చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: బంగారంపై అప్పు తీసుకునే ముందు వీటిని గమనిస్తున్నారా? లేదంటే ఘోరంగా నష్టపోతారు జాగ్రత్త..
ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లుగా కులగణనలో సర్వేలో పొరపాట్లు జరగలేదని చెప్పారు. కులగణన సర్వేను ఇలా తప్పు పడితే బీసీలు నష్టపోతారని తెలిపారు. కులగణన జరిగితేనే చట్టం ప్రకారం రిజర్వేషన్లను రాబట్టుకోవచ్చని అన్నారు.
అధికారిక లెక్కలుంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం చెప్పవచ్చని తెలిపారు. కులగణన సర్వే జరగకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.