Telangana Varisities : 8 యూనివర్సిటీలకు వీసీలు వీరేనా ?

Telangana Varisities : 8 యూనివర్సిటీలకు వీసీలు వీరేనా ?

Telangana Varisities

Updated On : May 22, 2021 / 7:25 AM IST

Vice-Chancellors : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 8 యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. నూతన వీసీల జాబితాను ప్రభుత్వం 2021, మే 22వ తేదీ శనివారం విడుదల చేసే అవకాశముంది. వీసీల నియామకంలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ రవీందర్‌, అంబేద్కర్‌ యూనివర్సిటీ వీసీగా సీతారామరావు, తెలుగు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా కిషన్‌రావు, శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ మల్లేశం పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్‌గుప్తా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ రాథోడ్‌, జేఎన్‌టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం.

Read More : Telangana State : టీకా కోసం ఎదురు చూపులు..కోవిడ్‌ టీకా పంపిణీ ఎప్పుడు..?