Telangana: మద్యం దుకాణాల కోసం కేవలం దరఖాస్తులతో సర్కార్‌కు ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా? లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారంటే?

గతంలో వైన్ షాపు టెండర్ల కోసం 79,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు భారీగా పెరిగాయి.

Telangana: మద్యం దుకాణాల కోసం కేవలం దరఖాస్తులతో సర్కార్‌కు ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా? లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారంటే?

Telangana wine shops

Updated On : August 18, 2023 / 8:05 PM IST

Telangana wine shops: తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 1,05,000కిపై దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.2,697 కోట్ల ఆదాయం వచ్చింది.

గతంలో వైన్ షాపు టెండర్ల కోసం 79,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు భారీగా పెరిగాయి. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అత్యధికంగా సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్ కు 8,883 ధరఖాస్తులు వచ్చాయి. రెండవ స్థానం లో శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ కి 8749 ధరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21 సోమవారం రోజు లక్కీ డ్రా తీయనున్నారు.

మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలూ జరుగుతాయి. ఈ నేపథ్యంలో వైన్ షాపుల టెండర్లకు మరింత స్పందన రావడం గమనార్హం.

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక బస్సు