Revanth Reddy: సీఎంవో అధికారులు సీఎం స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారా?

ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టకముందే ముఖ్యమంత్రి కార్యాలయంలో సమూల మార్పులు చేసి, చురుగ్గా పనిచేసే అధికారులను తెచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారట.

Revanth Reddy: సీఎంవో అధికారులు సీఎం స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారా?

CM Revanth Reddy

Updated On : November 18, 2024 / 7:47 PM IST

సీఎం రేవంత్ స్పీడ్‌కు తగ్గట్టుగా సీఎంవో అధికారులు పనిచేయడం లేదన్న టాక్ సెక్రటేరియట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. పాలనను సూపర్ ఫాస్ట్‌గా పరుగులు పెట్టించాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డి అధికారుల తీరుతో స్లో అయిపోతున్నారట. అందుకే ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేలోపే సీఎంవోలో సమూలంగా మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్దమయ్యారన్న చర్చ జరుగుతోంది. తన స్పీడ్‌కు అనుగుణంగా..ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుని సమస్యలు ఉంటే వేగంగా స్పందించే అధికారులను సీఎంవోలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.

సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు స్పీడ్‌గా రియాక్ట్‌ కావడం లేదట. అందుకే సీఎంవోలోని ఉన్నతాధికారుల పనితీరుపై రేవంత్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పనిలో తన వేగాన్ని సీఎంవో అధికారులు అందుకోలేకపోతున్నారన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం తప్పితే..అంతకు మించి ముందుకు వెళ్లడం లేదట.

నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆలస్యం?
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రతి అంశంలో స్వయంగా సీఎం మానిటరింగ్‌ చేసే వరకు అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి విషయాన్ని సీఎం రేవంత్ అధికారులకు గుర్తు చేయాల్సి వస్తోందట. ఉన్నతాధికారులెవరూ తమంతట తాము ఏ విషయంలోనూ ఆలోచించడం, ఇన్షియేషన్‌ తీసుకోవడం లేదని..చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొందరు IASలకు అదనపు బాధ్యతలు ఉండటం, సీఎంవోలో పనిచేస్తున్న అధికారుల్లో కొందరు నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా మారటం రేవంత్‌కు తలనొప్పిగా మారిందట.

చెప్పి చూశాం. అయినా మార్పు లేదు. ఇక మార్పులు చేయడమే సమస్యకు పరిష్కారమని భావిస్తున్నారట సీఎం. త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంవోలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సీనియర్ IAS అధికారుల్లో కొందరికి పదోన్నతులు కల్పించి వారిని సీఎంవోలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టకముందే ముఖ్యమంత్రి కార్యాలయంలో సమూల మార్పులు చేసి, చురుగ్గా పనిచేసే అధికారులను తెచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఎవరెవరిని సీఎంవోలోకి తీసుకోవాలన్నదానిపై రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సెక్రటేరియట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎవరెవరు వెళ్తున్నారు..ప్రస్తుతం సీఎంవోలో ఉన్నవారిలో ఎవరిని బయటికి పంపిస్తారనే దానిపై అధికారికవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అడ్డగోలుగా మాట్లాడిన నేతలకు డబిడిదిబిడేనా? కొడాలి నాని తిట్లపురాణంపై యాక్షన్‌కు పక్కా స్కెచ్