తెలంగాణ కాంగ్రెస్‌లో సెంటిమెంట్ ట్రెండ్‌.. గాంధీ భ‌వ‌న్‌లో వాస్తు, టైమింగ్, కుర్చీ విష‌యంలోనూ..

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కలిసొచ్చిన కుర్చీనే.. పీసీసీ ఛాంబ‌ర్‌కు షిప్ట్ చేయించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో సెంటిమెంట్ ట్రెండ్‌.. గాంధీ భ‌వ‌న్‌లో వాస్తు, టైమింగ్, కుర్చీ విష‌యంలోనూ..

Mahesh Kumar Goud

Updated On : September 30, 2024 / 8:14 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో సెంటిమెంట్ ట్రెండ్‌గా మారింది. ఒక ముఖ్యనేత పాలో అవుతున్న సెంటిమెంట్‌ అస్త్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆయ‌న వేసే ప్రతీ అడుగులో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఆ నేత కూర్చునే కుర్చీ గురించి ఇప్పుడు గాంధీభ‌వ‌న్‌లో హాట్ టాపిక్‌ అయింది. కుర్చీ దానికి ఉండే కండువా..ఇలా ప్రతీది డిస్కర్షన్‌గా అయిపోయింది. పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవ‌డం మొద‌లుకొని.. కూర్చునే కుర్చీ వ‌ర‌కు ప్రతీది పక్కాగా ఫాలో అవుతున్నారు.

ప్రస్తుతం పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న మ‌హేశ్‌ కూమార్ గౌడ్‌.. గాంధీభ‌వ‌న్‌లో వాస్తు, టైమింగ్ ఆఖ‌రికి ఆయ‌న కూర్చునే కుర్చీ విష‌యంలో కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఆయ‌న పీసీసీ చీఫ్‌గా చార్జ్ తీసుకున్న రోజు..తన పెళ్లి జ‌రిపించిన బ్రహ్మనుడి ఆధ్వర్యంలోనే పూజ‌లు చేసి..టైమింగ్ చూసుకొని మరీ బాధ్యతలు తీసుకున్నారు. సంత‌కం పెట్టడానికి కాస్త టైమ్ ఉండటంతో..సీఎం, మంత్రులు అంద‌రినీ వెయిట్ చేయించి ముహుర్తం ప్రకారం చార్జ్ తీసుకున్నారు.

అప్పట్లో కూర్చున్న కుర్చీనే పీసీసీ చీఫ్ ఛాంబ‌ర్‌కు..
ఇక కూర్చునే కుర్చీ విష‌యంలో కూడా మ‌హేశ్ గౌడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. త‌న‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కలిసొచ్చిన కుర్చీనే.. పీసీసీ ఛాంబ‌ర్‌కు షిప్ట్ చేయించారు. అంత‌కు ముందు పీసీసీగా రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీలో కాకుండా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను కూర్చున్న కుర్చీనే పీసీసీ చీఫ్ ఛాంబ‌ర్‌కు తరలించి అందులోనే కూర్చుకుంటున్నారు. అంతేకాదు ఆ కుర్చీకి ఉండే కండువాకు కూడా సెంటిమెంట్ ఉంద‌ట‌. కుర్చీకి త‌లభాగంలో ఉండే వైట్ కండువా తిరుమ‌ల నుంచి వ‌చ్చింద‌ట‌. ఆ కండువా కుర్చీకి క‌ట్టినప్పటి నుంచి మ‌హేష్ గౌడ్ అనుకున్న పీసీసీ పోస్ట్‌ ద‌క్కింద‌ని భావిస్తున్నారు.

పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్‌కు ఒక కుర్చీనే కాదు ప్రతీది సెంటిమెంట్‌గా క‌లిసొస్తుంద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఆయ‌న నివాసం ఉంటున్న ఇల్లును కూడా సెంటిమెంట్‌గా భావిస్తున్నార‌ట‌. హైద‌రాబాద్ నార్సింగ్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్నారు మహేశ్‌కుమార్‌గౌడ్‌. ఆ ఇంటికి మారిన త‌ర్వాతే..రాజ‌కీయంగా ఆయన ద‌శ మారింద‌ట‌.

ఊహించని విధంగా అవకాశాలు
కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లకు పైగా ఉన్నా ఎప్పుడు ఏదీ పెద్దగా క‌లిసిరాలేద‌ట‌. అయితే ఆ ఇంటికి మారిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఛాన్స్ ద‌క్కింది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేష‌న్ ఇంచార్జ్‌గా పార్టీలో మంచి వెలివేష‌న్ ద‌క్కింది. ఆ త‌ర్వాత ఊహించ‌ని విధంగా ఎమ్మెల్సీ అవ‌కాశం ద‌క్కడం.. ఆ త‌ర్వాత పార్టీలో అత్యుత్తమ స్థానం పీసీసీ చీఫ్ అవ‌కాశం కూడా ద‌క్కాయి. అందుకే ఇప్పుడు తాను ఉంటున్న ఆ అపార్టుమెంట్‌ను క‌లిసొచ్చే ఇల్లుగా భావిస్తున్నారు మహేశ్‌కుమార్‌గౌడ్.

పీసీసీ చీఫ్‌గా ఉన్న మ‌హేష్ గౌడ్ సెంటిమెంట్‌గా ఫాలో అవుతున్న అంశాలు పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో ప‌ద‌వులు ఆశిస్తున్న నేత‌లు కూడా సెంటిమెంట్ అంశాల‌పై బాగా ఫోక‌స్ పెడుతున్నార‌ట‌.

కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు? జనసేనాని బ్రదర్‌ కేంద్రమంత్రి కాబోతున్నారా?