TG SET 2025: గుడ్‌న్యూస్.. తెలంగాణ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. పరీక్షల తేదీ.. పేపర్లు.. పూర్తి వివరాలు ఇలా..
TG SET 2025 : తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకోసం TG-SET 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

TG SET 2025
TG SET 2025: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీ జీసెట్-2025)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలు, పేపర్-2లో 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 300కు గాను ప్రతీ పేపర్ కోసం 3 గంటల సమయం ఇవ్వను న్నారు.
కేవలం ఒక పేపర్లో ఉత్తీర్ణత సాధించడం సరిపోదు. పేపర్-1, పేపర్-2లో అభ్యర్థులు ఉత్తీర్ణులు అయితేనే అసిస్టెంట్, లెక్చరర్ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్-1లో సాధారణ బోధన, పరిశోధన అప్టిట్యూడ్, బోధనా నైపుణ్యాలు, తార్కిక విశ్లేషణ, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు వస్తాయి. పేపర్-2లో అభ్యర్థి ఎంపిక చేసిన స్పెషలైజేషన్ లేదా సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. దీంతో అభ్యర్థులు రెండు రకాల ప్రిపరేషన్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.
టీజీసెట్-2025 కోసం అభ్యర్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్స్ అక్టోబర్ 10 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్షలకు దర ఖాస్తు చేసేందుకు అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా ఫారం పూర్తి చేయాలి. దరఖాస్తు చేసేవారు అధికారిక వెబ్ సైట్ www.telanganaset.org ద్వారా ఫారం నింపవచ్చు. అదనంగా, పూర్తి సమాచారం కోసం ఓస్మానియా యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ www.osmania.ac.inలో కూడా వివరాలు అందుబాటులో ఉంటాయి.